అశ్లీల వీడియోల వీక్షణ.. 600 మందిపై కేసు

సాక్షి, చెన్నై : బాలికల అశ్లీల వీడియోలను వీక్షించిన 600 మందిపై పోలీసులు కేసులు పెట్టారు. దీంతో వీరంతా అరెస్టు కానున్నారు. ఇంటర్నెట్‌లో బాల, బాలికల అశ్లీల వీడియోలను చూసేవారిని అరెస్టు చేసేందుకు పోలీసులు నిర్ణయించారు. దీంతో మహిళలు, చిన్నారులపై నేరాల నియంత్రణ విభాగం అడిషనల్‌ డీజీపీ రవి నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా అశ్లీల వీడియోలను చూసే వారి జాబితాను పోలీసు అధికారులు సేకరిస్తున్నారు. దీనికి సంబంధించి 600 మంది పేర్లు, వివరాలను సేకరించారు. దీన్ని చెన్నై, ఇతర జిల్లాల పోలీసు అధికారులకు పంపి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు.